: జైట్లీ చేతిలో ఐఫోన్ 6ఎస్...చుట్టూ చేరిన ఆజాద్, ఆనంద్ శర్మ, డి.రాజా: సోషల్ మీడియాలో ఫొటో వైరల్


పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేతిలో తన ఐఫోన్ 6ఎస్ ను పట్టుకుని అందులోని వీడియోను చూపించగా, దానిని కాంగ్రెస్ పార్టీ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, సీపీఐ నేత డి.రాజాలు ఆసక్తిగా చూశారు. అందులో ఏముందో తెలియదు కాని, వీడియో మొత్తం ప్లే అయ్యేదాకా వారు నలుగురూ అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా పక్కకు వేయలేదు. అంతేకాక వారి దృష్టి మరలలేదు. ఈ ఫొటోను నేషనల్ మీడియాకు చెందిన ఓ ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. సదరు ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఆ వీడియోలో ఏముందో తెలియదు కాని, దానిని చూసిన తర్వాత జేఎన్ యూ ఘటనపై ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలను కాంగ్రెస్ పార్టీ ఎంతమాత్రం సహించబోదని ఆయన తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News