: రూర్కెలాలో పోలీసుల హంట్... నలుగురు సిమి ముష్కరుల అరెస్ట్, నాలుగు రివాల్వర్లు సీజ్
ఒడిశాలోని రూర్కెలాలో మూడు గంటల పాటు కొనసాగిన పోలీసుల సోదాల్లో నలుగురు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ఉగ్రవాదుల నుంచి పోలీసులు నాలుగు రివాల్వర్లతో పాటు పెద్ద సంఖ్యలో బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. రూర్కెలాలో ఉగ్రవాదులున్నారన్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఒడిశా పోలీసులతో కలిసి తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసుల అలికిడిని గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీనికి ప్రతిగా పోలీసులు కూడా కాల్పులు జరపాల్సి వచ్చింది. దాదాపు మూడు గంటల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఆ తర్వాత చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు నలుగురు సిమి ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.