: 308 పతకాలతో నెంబర్ వన్ గా భారత్
గౌహతీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ స్టేడియంలో దక్షిణాసియా క్రీడలు అట్టహాసంగా ముగిశాయి. ఎనిమిది దేశాలు పాల్గొన్న ఈ క్రీడల్లో ఆతిథ్య భారత దేశం 308 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ముగింపు కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి సర్బానంద సోనోవాల్ తో పాటు అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, మేఘాలయ క్రీడా మంత్రి జనిత్ ఎం సంగ్మా పాల్గొన్నారు. అసోం, మేఘాలయా రాష్ట్రాల్లో 12 రోజులపాటు నిర్వహించిన ఈ క్రీడల్లో 2,500 మంది క్రీడాకారులు పాల్గొన్నారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 188 స్వర్ణ, 90 రజత, 30 కాంస్య పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో పాటు, ద్వితీయ స్థానంలో నిలిచిన శ్రీలంక (186), మూడవ స్థానంలో నిలిచిన పాకిస్థాన్ (106) దేశాలకు చెందిన క్రీడాకారులను అభినందించారు.