: టికెట్ లేని ప్రయాణికుల నుంచి 104 కోట్లు రాబట్టిన రైల్వే శాఖ


టికెట్లు లేకుండా ప్రయాణిస్తున్న వారి నుంచి 104 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు రైల్వే శాఖ తెలిపింది. ఏప్రిల్ 2015 నుంచి జనవరి 2016 మధ్య కాలంలో టికెట్ లేకుండా ప్రయాణించిన 20.17 లక్షల కేసులను సెంట్రల్ రైల్వే ప్రత్యేక డ్రైవ్ గుర్తించింది. వీరి నుంచి 103 కోట్ల 95 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. గతేడాది ఇలాంటి డ్రైవ్ ద్వారా 17.91 లక్షల కేసుల్లో 85.39 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు అధికారులు తెలిపారు. టికెట్లు లేకుండా ప్రయాణం చేేసే వారికి అడ్డుకట్ట వేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News