: కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన రాజేందర్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. నారాయణపేట్ నియోజకవర్గానికి చెందిన రాజేందర్ రెడ్డి నేడు అధికారికంగా టీఆర్ఎస్ లో చేరినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, బంగారు తెలంగాణ సాధన దిశగా అడుగులు వేసేందుకు పార్టీ మారానని అన్నారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్టీ అని ఆయన అన్నారు. నారాయణపేట్ నియోజకవర్గంలో సౌకర్యాలు కల్పించేందుకు ముఖ్యమంత్రితో చర్చించానని, ఆయన సహకరిస్తానని హామీ ఇచ్చారన్నారు. తాను కూడా కష్టపడి పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తానని అన్నారు.