: ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలి: మెదక్ నేతలతో కేసీఆర్
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలని మెదక్ టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ సూచించారు. మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసిన అనంతరం మంత్రి హరీష్ రావు, ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కేసీఆర్ ను కలిశారు. నారాయణ ఖేడ్ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతలు తీసుకోవాలని హరీశ్ రావును సీఎం ఆదేశించారు. కాగా, ఈ ఉప ఎన్నికలో తన సమీప ప్రత్యర్థి సంజీవరెడ్డిపై 53,625 ఓట్ల మెజార్టీతో భూపాల్ రెడ్డి విజయం సాధించారు.