: రాష్ట్రంలో జరిగే అన్ని కుట్రలకు జగనే సూత్రధారి: దేవినేని ఉమ


ఆంధ్రప్రదేశ్ లో జరిగే అన్ని కుట్రలకు వైఎస్సార్సీపీ అధినేత జగనే కారకుడని మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతలు ఎక్కడైనా అభివృద్ధిని కోరుకుంటారని, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. కుల, మత, ప్రాంతాల వారీగా చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తూ జగన్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. అయినప్పటికీ టీడీపీ ప్రజల కోసం కష్టపడుతోందని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు 2,500 కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుంచి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News