: శ్రీకృష్ణదేవరాయలుగా బాలయ్య!


హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో అలరించనున్నారు. అయితే, ఆయన ఈ పాత్ర పోషిస్తున్నది కొత్త సినిమాలో కాదు, లేపాక్షి ఉత్సవాల్లో! ఈ నెల 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు లేపాక్షి ఉత్సవాలను హిందూపురంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే ఓ కార్యక్రమంలో తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటే పాత్రలో ఆయన కనిపించనున్నారు. కాగా, ఆదిత్య 369 చిత్రంలో శ్రీకృష్ణదేవరాయలు పాత్రను పోషించిన బాలకృష్ణ ప్రేక్షకుల, అభిమానుల ఆదరణ పొందిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News