: జియాఖాన్ కేసులో కొత్త మలుపు...కేసును ఎఫ్ బీఐకి అప్పగించాలంటున్న తల్లి


ప్రముఖ బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య కేసు కొత్తమలుపు తిరిగింది. సీబీఐ దర్యాప్తు చేసిన ఈ కేసులో జియా ఆత్మహత్య చేసుకుందని పేర్కోవడంపై ఆమె తల్లి రబియా ఖాన్ ముంబై కోర్టులో పిటిషన్ వేశారు. ఆమె హత్యకు గురైతే, సీబీఐ మాత్రం ఆత్మహత్యకు గురైందని పేర్కొన్నారని ఆమె పిటిషన్ లో తెలిపారు. జియా ఖాన్ అమెరికాలో పుట్టిన కారణంగా ఈ కేసును ఎఫ్ బీఐకి అప్పగించాలని పిటిషన్ లో డిమాండ్ చేశారు. కేసును ఇన్ని రోజులు వాయిదా వేసేందుకు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో సూరజ్ పంచోలీ హస్తం ఉందా? లేదా? అనేది తేల్చకుండా సీబీఐ కేసును మూసివేసిందని ఆమె ఆరోపించారు. నిజానికి పిటిషన్ వేసిన వారిని, అమెరికా కాన్సులేట్ ను తప్పుదోవపట్టిస్తున్నారని ఆమె తెలిపారు. కాగా, ఈ పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానుంది.

  • Loading...

More Telugu News