: సల్లూ భాయ్ కి కత్రినా మళ్లీ దగ్గరౌతోందా?
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు కత్రినా కైఫ్ మళ్లీ దగ్గరవుతోందా? అంటే తాజా పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో కత్రినాతో సల్మాన్ ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. రణ్ బీర్ కపూర్ తో ప్రేమలో పడిన సందర్భంలో ఓ సారి సల్మాన్ పూటుగా మందు కొట్టి కత్రినా అపార్ట్ మెంట్ కి వెళ్లి, 'రణ్ బీర్ కోసం నన్ను వదిలేశావ్, ఏదో ఒకరోజు అతను నిన్ను వదిలేస్తాడు' అంటూ శాపనార్థాలు పెడుతూ, నానా రభస చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. అప్పుడు సల్మాన్ శపించినట్టే రణ్ బీర్, కత్రినా బంధం ఇప్పుడు బీటలు వారింది. దీంతో తాను నటించిన 'ఫితూర్' సినిమాకు ఎడిటింగ్ సలహాలు ఇవ్వాలని కత్రినా, సల్మాన్ ను కోరింది. అలాగే సల్మాన్ హోస్ట్ చేసిన 'బిగ్ బాస్9' షోలో పాల్గొంది. ఇవన్నీ చూస్తుంటే సల్మాన్ కు కత్రినా మళ్లీ దగ్గరవుతోందని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటుండగా, నిన్న ముంబైలో జరిగిన అర్పిత ఖాన్ సీమంతానికి మాజీ ప్రేయసి సంగీతా బిజ్ లానీతో హాజరైన సల్మాన్ మరోసారి అందరి మెదళ్లకు మేత పెట్టాడు!