: ఇజ్రాయిల్ లో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి!


ఇజ్రాయిల్ లోని ఒక యూనివర్శిటీలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చిత్తూరు జిల్లా రామకుప్ప మండలం ఆనిగానూరు మాజీ సర్పంచ్ రామమూర్తి కుమారుడు రాజ్ కుమార్, సుమారు తొమ్మిది నెలల క్రితం టెల్ అవీవ్ యూనివర్శిటీలో పీహెచ్ డి విద్యార్థిగా చేరాడు. ప్రతిరోజూ తల్లిదండ్రులకు ఫోన్ చేసేవాడు. ఈ నెల 13వ తేదీన చివరిసారిగా రాజ్ కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసినట్లు సమాచారం. నిన్న రాత్రి 9 గంటల సమయంలో యూనివర్శిటీ అధికారులు రాజ్ కుమార్ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. రాజ్ కుమార్ ఆరోగ్యం సరిగ్గా లేదన్న విషయాన్ని చెప్పారు. ఈ వార్తతో కంగారుపడ్డ రాజ్ కుమార్ తల్లిదండ్రులు స్థానిక టీడీపీ నాయకులను కలుసుకుని వెంటనే హైదరాబాద్ కు బయలుదేరారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, ఇజ్రాయిల్ దేశ ప్రతినిధులను సంప్రదించారు. చివరికి రాజ్ కుమార్ మరణించినట్టు సమాచారం అందింది. విద్యార్థి మృతదేహాన్ని ఇక్కడికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా, రాజ్ కుమార్ తమిళనాడులోని వేలూరు విట్ లో ఎంఎస్సీ, కుప్పంలోని ద్రవిడయన్ యూనివర్శిటీలో బీఎస్సీ (గోల్డ్ మెడల్) చేశాడు.

  • Loading...

More Telugu News