: అగ్రిగోల్డ్ ఛైర్మన్, ఎండీలకు సీఐడీ కస్టడీ... బెయిలు పిటిషన్ కొట్టివేత


అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వాస్ వెంకటరామారావు, ఎండీ శేషునారాయణలను సీఐడీ కస్టడీకి ఇచ్చేందుకు ఏలూరు జిల్లా న్యాయస్థానం అనుమతి నిచ్చింది. పది రోజుల పాటు వారిద్దరినీ సీఐడీ అధికారులు విచారించేందుకు అంగీకారం తెలిపింది. న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని ఆదేశిస్తూ ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు అగ్రిగోల్డ్ ఛైర్మన్, ఎండీ దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. బాధితుల నుంచి భారీ స్థాయిలో డిపాజిట్లు సేకరించి చేతులెత్తేసిన కేసులో అరెస్టయిన ఛైర్మన్, ఎండీలు ప్రస్తుతం ఏలూరు జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News