: ఎన్ని తరాల చరిత్రయినా ఈ డిస్క్ లో భద్రపరచుకోవచ్చు!
వందల కోట్ల సంవ్సతరాల చరిత్రను భద్రపరచుకునే సామర్థ్యం గల 5 డైమెన్షనల్ డేటా డిస్క్ ను లండన్ పరిశోధకులు రూపొందించారు. ‘సూపర్ మ్యాన్ మెమరీ క్రిస్టల్’గా పిలువ బడే ఈ డేటా డిస్క్ సామర్థ్యం 360 టెరా బైట్లు. సౌతాంప్టన్ యూనివర్శిటీ ఆప్టో ఎలక్ట్రానిక్స్ పరిశోధన కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు దీనిని రూపొందించారు. కొన్ని తరాల పాటు చెక్కుచెదరకుండా ఉండే ఈ డేటా డిస్క్ లోని సాంకేతికతతో నేషనల్ ఆర్కైవ్స్, మ్యూజియం, లైబ్రరీ మొదలైన సంస్థల సమాచారాన్ని ఇందులో భద్రపరచుకోవచ్చు. 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఈ డిస్క్ తట్టుకోగలదు. కాగా, ఈ టెక్నాలజీని 2013లో పరీక్షించినప్పుడు 300 కిలోబైట్ల డిజిటల్ టెక్ట్స్ ఫైల్ ను విజయవంతంగా ఈ డిస్క్ లో భద్రపరిచారు.