: పాకిస్థాన్ ను విమర్శించలేదు...నిషేధం ఎత్తివేస్తారు: షబానా అజ్మీ
తమ సినిమాలో పాకిస్థాన్ ను విమర్శించ లేదని షబానా అజ్మీ తెలిపారు. 'నీరజ' సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తమ సినిమాలో విమానం హైజాక్ అయిన సందర్భాన్ని మాత్రమే చూపించామని అన్నారు. పాకిస్థాన్ లో ఈ సినిమాపై నిషేధం విధించడంపై ఆమె మాట్లాడుతూ, ఇందులో పాకిస్థాన్ ను విమర్శించలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ సినిమాను పాకిస్థాన్ సెలక్షన్ కమిటీ ఇంకా చూడలేదని అన్నారు. సినిమా చూసిన తరువాత నిషేధం ఎత్తివేస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 1986లో కరాచీలో పాన్ ఆమ్ విమానం హైజాక్ కు గురైంది. ఈ విమానంలో ఎయిర్ హోస్టెస్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న 21 ఏళ్ల భారతీయ యువతి 'నీరజ భానోత్' ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రయాణికుల ప్రాణాలు కాపాడింది. ఈ చారిత్రాత్మక సినిమాను రామ్ మధ్వానీ తెరకెక్కించారు. ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.