: బాహుబలి 'మలయాళ' రికార్డును బ్రేక్ చేసిన ఎన్టీఆర్!
ఓ తెలుగు చిత్రానికి మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక డబ్బింగ్ రైట్స్ పలికిన చిత్రంగా బాహుబలి నెలకొల్పిన రికార్డును ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'జనతా గ్యారేజ్' బద్దలు కొట్టినట్టు తెలుస్తోంది. బాహుబలి మలయాళ రైట్స్ రూ. 3.8 కోట్లకు అమ్ముడుకాగా, జనతా గ్యారేజ్ రైట్స్ రూ. 4.5 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం. ఈ చిత్రంలో మాలీవుడ్ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండటం, అక్కడి యువ హీరో ముకుందన్ ఈ చిత్రంలో విలన్ కావడంతో పాటు మలయాళీలకు మంచి పరిచయమున్న నిత్యామీనన్ హీరోయిన్ కావడంతోనే సినిమా హక్కులకు మంచి రేటు పలికిందని సినీ రంగ నిపుణులు వ్యాఖ్యానించారు.