: పోలీసులకు ఫిర్యాదు చేశాడని.. కొడుక్కి గుండుకొట్టించి ఊరేగించారు!


భూ వివాదంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడనే కోపంతో ఒక దళిత బాలుడికి గుండుకొట్టించి ఊరంతా తిప్పి అవమానించిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని దబౌలి గ్రామంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు...వీరేంద్ర కుమార్ మిశ్రా అనే వ్యక్తి ఆ గ్రామంలో ఇటుక బట్టి నిర్వహిస్తున్నాడు. దాని పక్కనే పూర్వీకుల నుంచి బాధితుడికి వచ్చిన స్థలం కూడా ఉంది. ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు ఇటుక బట్టీ యజమాని ప్రయత్నించాడు. దీంతో వారి మధ్య వివాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై కోపంగా ఉన్న వీరేంద్ర, ఆయన వద్ద పనిచేసే ఇద్దరు ఉద్యోగులు బాధితుడి కొడుకుకి గుండు కొట్టించి, మెడలో చెప్పుల దండ వేసి ఆ గ్రామంలో ఊరేగించారని బాధితులు ఆరోపించారు.

  • Loading...

More Telugu News