: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జార్జ్ బుష్


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గట్టి పోటీ ఏర్పడడంతో ఆ దేశ మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ రంగంలోకి దిగారు. ఈ ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం బుష్ సోదరుడు, ఫ్లోరిడా గవర్నర్ గా పనిచేసిన జెబ్ బుష్ పోటీలో ఉన్నారు. పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యేందుకు ఇంతవరకు జరిగిన పార్టీ అంతర్గత ఎన్నికల్లో ఆ పార్టీ మరో అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఒకసారి ఓడి, మరోసారి గెలుపొందారు. అయితే, జెబ్ బుష్ ఒక్కసారి కూడా గెలవలేకపోయారు. తదుపరి సౌత్ కరోలినాలో అంతర్గత ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో జార్జ్ బుష్ కరోలినాలో తమ్ముడి తరపున ప్రచారం చేశారు. తమ తండ్రి తమకెప్పుడూ ఒక మాట చెబుతుండేవారని, అధ్యక్ష పదవి అనేది చాలా సీరియస్ జాబ్ అని, మంచి నిర్ణయాలు తీసుకోగలిగినవారు, మంచి ఆలోచనలు ఉన్నవారే ఆ పదవిని అధిరోహించాలని చెప్పేవారని జార్జ్ బుష్ తెలిపారు. తన తమ్ముడు జెబ్ బుష్ కు చాలా అనుభవం ఉందని, అధ్యక్షుడు కాదగిన లక్షణాలు ఉన్నవ్యక్తి అని తెలిపారు. కాబట్టి తన సోదరుడిని రిపబ్లికన్ అభ్యర్థిగా ఎన్నుకోవాలని బుష్ కోరారు.

  • Loading...

More Telugu News