: 31 సెకెన్లలో రెండు లక్షల ఫోన్లకు ఆర్డర్
ఈ కామర్స్ సంస్థల్లో మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎగబడుతున్నారు. ఫ్లాష్ సేల్ అంటే చాలు ఆర్డర్లు, రిజిస్ట్రేషన్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. దీంతో భారత దేశంలో స్మార్ట్ ఫోన్ల మార్కెట్ కు ఎంత డిమాండ్ వుందో తేటతెల్లం అవుతోంది. తాజాగా ఫ్లిప్ కార్ట్ లో 'లీ ఎకో' అనే సరికొత్త స్మార్ట్ ఫోన్ సంస్థ ఫ్లాష్ సేల్ కోసం ఆర్డర్లు, రిజిస్ట్రేషన్లు కోరింది. ఆఫర్ ప్రారంభమవ్వగానే ఆర్డర్ల వెల్లువ మొదలైంది కేవలం 31 సెకెన్లు ముగిసేసరికి ఈ ఫోన్ కావాలంటూ రెండు లక్షల ఇరవై వేల మంది ఆర్డర్ చేసుకోగా, సుమారు 20,28,000 మంది రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది.