: అంగోలాలో 404 క్యారెట్ల అతిపెద్ద వజ్రం గుర్తింపు
అపురూపమైన, విలువైన వజ్రాల అన్వేషణలో భాగంగా పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన లుకాపా మైనింగ్ కంపెనీ అతి పెద్ద వజ్రాన్ని కనుగొంది. అంగోలాలోని మారుమూల ప్రాంతంలో 700 కిలోమీటర్ల లోతట్టు తీరంలో 404 క్యారెట్ల వజ్రాన్ని గుర్తించింది. దాని విలువ సుమారు 14 మిలియన్ డాలర్ల పైగానే ఉంటుందని లుకాపా సంస్థ ఛైర్మన్, మైల్స్ కెన్నడీ ప్రకటించారు. అంగోలా దేశంలో ఈ వజ్రం అతిపెద్దదని, తమ అన్వేషణలో బయటపడిన ఈ వజ్రం ప్రపంచంలో 28వ పెద్ద వజ్రమని వెల్లడించారు. ఇకముందు కూడా వజ్రాల కోసం తమ ప్రయత్నాలు ఇలానే కొనసాగుతాయని స్పష్టం చేశారు. మరోవైపు అతిపెద్ద వజ్రం కనుగొన్నామని ప్రకటించిన వెంటనే లుకాపా కంపెనీ షేర్లు 29 శాతం లాభాలను నమోదు చేసుకున్నాయి.