: ఈ భయం ఇలా ఇంకెంత కాలం?: సోనమ్ కపూర్


'ప్రేమ్ రతన్ ధన్ పాయో'తో మంచి కమర్షియల్ హిట్ అందుకున్న సోనమ్ కపూర్ తాజాగా 'నీరజ' సినిమాతో అభిమానుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాను హిట్ చేసేందుకు శాయశక్తులా ప్రమోషన్ ఇస్తోంది. అందులో భాగంగా పలువురు బాలీవుడ్ నటులకున్న వివిధ భయాలను వారితోనే చెప్పిస్తోంది. తాజాగా తనలో ఎప్పటి నుంచో ఉన్న భయాన్ని కూడా బయటపెట్టింది. ఇంకా ఎంతకాలం అనిల్ కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలో కొనసాగాలన్నదే తన భయమని చెప్పింది. తనకంటూ సొంతంగా గుర్తింపు రాదా? అనే భయం వెంటాడుతోందని సోనమ్ చెప్పింది. సొంతంగా గుర్తింపుతెచ్చుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్నట్టు సోనమ్ చెబుతోంది. అయితే తాను ఎక్కడికెళ్లినా తన తండ్రి పేరుతోనే గుర్తు పడతారని వెల్లడించింది. అనిల్ కపూర్ కుమార్తెగా గుర్తించినప్పుడు ఆనందంగా ఉంటుందని, ఏ కుమార్తెకైనా అదే ఆనందమని తెలిపింది. తమ కోసం తన తండ్రి ఎంతో కష్టపడ్డారని పేర్కొంది. చివరిగా, ఆయన కుమార్తెగా గుర్తించడం తనకు ఎంతో బలాన్నిస్తుందని సోనమ్ తెలిపింది.

  • Loading...

More Telugu News