: ఐడియా 4జీ సేవలు ప్రారంభం
ఐడియా 4జీ సేవలు ప్రారంభం కానున్నాయి. గతంలో 4జీ సేవలను వీలైనంత త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించిన ఐడియా, ఈ మేరకు చెన్నైలో తన సేవలు ప్రారంభించింది. చెన్నైతో పాటు తమిళనాడులోని 29 పట్టణాల్లో ఐడియా 4జీ సేవలు ప్రారంభించామని సంస్థ తెలిపింది. రానున్న రెండు నెలల్లో రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఈ సేవలను విస్తరిస్తామని ఐడియా తెలిపింది. 3జీకి వర్తించిన ఛార్జీలే 4జీకి కూడా వర్తిస్తాయని ఆ సంస్థ ప్రకటించింది. 4జీకి సంబంధించిన సేవల రీఛార్జ్ కార్డులు 21 రూపాయల నుంచి ప్రారంభమవుతాయని, ఇవి అన్ని షోరూముల్లోను అందుబాటులో ఉంటాయని ఈ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.