: ‘డ్రీమ్ గర్ల్’ మ్యూజిక్ ఆల్బమ్ ఆవిష్కరణ
అలనాటి అందాల నటి హేమమాలిని రూపొందించిన ‘డ్రీమ్ గర్ల్’ అనే మ్యూజిక్ ఆల్బమ్ ని ‘షోలే’ చిత్రం హీరోలు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హేమమాలిని మాట్లాడుతూ, గాయకుడు, కేంద్రమంత్రి కూడా అయిన బాబుల్ సుప్రియో ఈ ఆల్బమ్ కు సంగీతం సమకూర్చారని, సుప్రియోతో కలిసి ఇందులో తాను కొన్ని పాటలు పాడానని చెప్పారు. తాను ఎంతో అభిమానించే నాటి నటుడు కిషోర్ కుమార్ కోసం ఈ పాటలు పాడినట్లు చెప్పారు. తన భర్త ధర్మేంద్ర, అమితాబ్ లతో కలిసి కూడా పాటలు పాడాలని ఉందన్న కోరికను ఈ సందర్భంగా నాటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని బయటపెట్టింది. ఈ కార్యక్రమంలో జయాబచ్చన్, షోలే చిత్ర దర్శకుడు రమేష్ సిప్పి కూడా పాల్గొన్నారు.