: రూ. 2,999కి 7 అంగుళాల సెల్ కాన్ కొత్త ట్యాబ్లెట్
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ, స్వదేశీ సెల్ ఫోన్ తయారీ సంస్థగా గుర్తింపు పొందిన సెల్ కాన్, భారత మార్కెట్లోకి చౌక ధరలో ట్యాబ్లెట్ ను అందుబాటులోకి తెచ్చింది. 'సీటీ 111' పేరిట విడుదలైన ఈ ట్యాబ్లెట్ ధర రూ. 2,999 అని సంస్థ వెల్లడించింది. 7 అంగుళాల టచ్ స్క్రీన్ తో పాటు, ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్, 1.3 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, వైఫైలతో పాటు రెండు కెమెరాలు ఉంటాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వైడీ గురు తెలిపారు. సెల్ కాన్ ట్యాబ్లెట్ అమ్మకాల వృద్ధికి ఈ కొత్త ప్రొడక్ట్ ఉపకరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.