: రెట్టించిన ఉత్సాహంతో కేటీఆర్!...గ్రేటర్ వరంగల్ కూడా తమదేనని కామెంట్
మొన్న గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ రికార్డు విజయం, నేడు మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో చిరస్మరణీయ గెలుపుతో టీఆర్ఎస్ యువనేత, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. కొద్దిసేపటి క్రితం గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ లో అడుగుపెట్టిన ఆయన అక్కడ ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఖేడ్ లో నమోదైన విజయం గ్రేటర్ వరంగల్ లోనూ పునరావృతం కానుందని ఆయన పేర్కొన్నారు.