: ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే వెంకటరావు అనుచరుల మధ్య బ్యానర్ల వివాదం


ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు అనుచరుల మధ్య బ్యానర్ల వివాదం చోటు చేసుకుంది. జిల్లాలో సీఎం కేసీఆర్ రెండో రోజు పర్యటన కొనసాగుతున్న క్రమంలో ఇవాళ టేకులపల్లి మండలం రోళ్లపాడులో బహిరంగసభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు వస్తున్న సీఎంను స్వాగతిస్తూ ఎమ్మెల్యే వెంకటరావు అనుచరులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిలో మంత్రి తుమ్మల ఫోటో లేకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఇల్లందుకు చెందిన తుమ్మల అనుచరులు కొంతమంది ఆ ఫ్లెక్సీలను చించివేశారు. దాంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పి పంపించారు.

  • Loading...

More Telugu News