: దయచేసి సహకరించండి: విపక్షాలకు ప్రధాని వినతి


ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ విపక్ష నేతలను కోరారు. ఈ ఉదయం పలువురు విపక్ష నేతలతో సమావేశమైన ఆయన, కీలకమైన జీఎస్టీ, సంస్కరణల బిల్లుల అమలుకు సహకారం అందించాలని ఆయన కోరినట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ వర్శిటీ ఘటన సహా అన్నింటిపైనా చర్చకు సిద్ధమేనని ప్రతిపక్షాలకు స్పష్టం చేసినట్టు వివరించారు. అరుణాచల్ ప్రదేశ్ లో నెలకొన్న ఘటనలు, హైదరాబాద్ లో రోహిత్ వేముల ఆత్మహత్య తదితరాలు కూడా అఖిలపక్ష సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడితో పాటు విపక్ష పార్టీల నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, పీసీ గుప్తా తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News