: జేఎన్ యూ ఘటనపై కేజ్రీ వివాదాస్పద కార్టూన్... ట్విట్టర్ లో వెల్లువెత్తిన నిరసనలు


దేశవ్యాప్తంగా పెను సంచలనానికి తెర తీసిన ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఘటనకు సంబంధించి ఓ చిన్న కార్టూన్ వేసిన ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వివాదంలో చిక్కుకున్నారు. భారత పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురుకు ఉరిని వ్యతిరేకిస్తూ వర్సిటీలో కొందరు విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం, దానిని ఏబీవీపీ అడ్డుకున్న నేపథ్యంలో వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. విద్యార్థి సంఘాల మధ్య రాజుకున్న ఈ వివాదం తాజాగా రాజకీయ రంగు పులుముకుంది. ఈ సందర్భంగా దీనిపై ఓ చిన్న కార్టూన్ వేసిన కేజ్రీ... దానిని నేటి ఉదయం తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు హనుమంతుడు హైదరాబాదు సెంట్రల్ వర్సిటీ, పఠాన్ కోట్, ముంబై మేకిన్ ఇండియా వేదిక... తాజాగా జేఎన్ యూలో చిచ్చుపెట్టినట్టు ఉన్న సదరు కార్టూన్ పై నెటిజన్లు వేగంగా స్పందించారు. ‘కేజ్రీవాల్ ఇన్ సల్ట్స్ హనుమాన్’ పేరిట ట్విట్టర్ లో ప్రత్యక్షమైన హ్యాండిల్ లో నెటిజన్లు ఘాటుగా స్పందించారు. చివరకు హనుమంతుడిని కూడా వదలని కేజ్రీపై కేసు నమోదు చేయడమే కాక తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News