: సైనిక లాంఛనాలతో ముగిసిన ముస్తాక్ అంత్యక్రియలు
అమరజవాను ముస్తాక్ అహ్మద్ అంత్యక్రియలు కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్నెపల్లిలో ముగిశాయి. ముందుగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరపగా, సైనికులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ముస్లిం సంప్రదాయంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ప్రతిపక్ష నేత జగన్, ఎమ్మెల్యేలు, అధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతకుముందు పార్నెపల్లిలో ముస్తాక్ అంతిమయాత్ర జరిగింది. ముస్తాక్ భౌతిక కాయాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.