: పొరపాటున గెలాక్సీ ఎస్7 వీడియోను లీక్ చేసిన శాంసంగ్, ఎలా ఉందంటే..?


శాంసంగ్ తదుపరి తరం స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ ఫోన్లు త్వరలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో తొలిసారిగా ప్రజల ముందుకు రానుండగా, ఇండోనేషియాలోని సంస్థ బ్రాంచ్, పొరపాటున ఈ ఫోన్ ప్రోమో వీడియోను విడుదల చేసింది. గెలాక్సీ ఎస్6 లాగానే కనిపిస్తున్న ఫోన్ వాటర్ రెసిస్టెంట్ తో పాటు వైర్ లెస్ చార్జింగ్ కు మద్దతిస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ పై వచ్చిన లీక్ లను బట్టి, తక్కువ బరువు, మరింత మెరుగైన కెమెరా ఉంటుందని తెలుస్తోంది. సరికొత్త శాంసంగ్ ఎక్సీనాస్ 8990 ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ రామ్, 32 జీబీ మెమొరీ సామర్థ్యం, 5.1 అంగుళాల 1140/2560 పిక్సెల్ రెజల్యూషన్ స్క్రీన్, సూపర్ అమోలెడ్ ప్యానల్స్ ఉంటాయని తెలుస్తోంది. ఎస్ 6లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండగా, ఎస్7 వేరియంట్ లో 12 మెగాపిక్సల్ కెమెరా ఉంటుందని సమాచారం. అయినప్పటికీ మెరుగైన పిక్చర్ క్వాలిటీ, తక్కువ లైటింగ్ లో మరింత స్పష్టమైన చిత్రాలు దీని సొంతమని సమాచారం.

  • Loading...

More Telugu News