: ఖేడ్ లో నా విజయం కేసీఆర్ కు బర్త్ డే గిఫ్ట్: భూపాల్ రెడ్డి
మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికలో తాను సాధించిన విజయాన్ని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కు జన్మదిన కానుకగా ఇవ్వనున్నట్లు ఆ పార్టీ నేత, ఖేడ్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన భూపాల్ రెడ్డి ప్రకటించారు. ఖేడ్ లో కౌంటింగ్ ముగిసిన తర్వాత ఆయన ఓ టీవీ చానెల్ తో మాట్లాడుతూ, కేసీఆర్ పై నమ్మకముంచిన ప్రజలు తనను గెలిపించారని పేర్కొన్నారు. తనపై నమ్మకముంచి ఓట్లేసిన ఖేడ్ ప్రజలను అభివృద్ధి పథంలోకి తీసుకెళతానని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా నియోజకవర్గాన్ని విద్యాపరంగా అభివృద్ధి చేస్తానన్నారు. తాగు, సాగు నీటి రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన ప్రకటించారు.