: 53 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన భూపాల్ రెడ్డి
మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ ఉపఎన్నిక పూర్తి ఫలితం వెల్లడింది. అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి సంజీవరెడ్డిపై 53,625 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పోలైన మొత్తం ఓట్లలో భూపాల్ రెడ్డికి 93,076 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డికి 39,451 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి విజయపాల్ రెడ్డికి 14,787 ఓట్లు మాత్రమే వచ్చాయి.