: బై పోల్స్... ఒక్కో చోట ఒక్కో రకం, ముజఫర్ పూర్ లో ఎస్పీ, హెబ్బల్ లో బీజేపీ, బీదర్ లో కాంగ్రెస్


గతవారం చివర్లో దేశవ్యాప్తంగా ఉపఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు నేడు జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రజలు తాము ఏ రాజకీయ పార్టీ వైపున ఉన్నామన్నది స్పష్టంగా చెప్పలేదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పార్టీ గెలుపు దిశగా సాగుతుండగా, కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు సత్తా చాటాయి. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార సమాజ్ వాదీ అభ్యర్థి 10 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మధ్యప్రదేశ్ లోని మైహర్ లో బీజేపీ అభ్యర్థి నారాయణ్ త్రిపాఠి 2,452 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, మహారాష్ట్రలోని పాల్ ఘర్ లో శివసేన అభ్యర్థి అమిత్ గోఢా ఎనిమిది రౌండ్ల ఓట్ల లెక్కింపు అనంతరం విజయం వైపు దూసుకెళుతున్నారు. కర్నాటకలోని హెబ్బల్ లో బీజేపీ అభ్యర్థి వైఏ నారాయణ స్వామి 12,063 ఓట్ల లీడింగ్ లో ఉండగా, బీదర్ లో కాంగ్రెస్ అభ్యర్థి రహీం ఖాన్ 3,062 ఓట్ల ఆధిక్యంలో, దేవదుర్గలో బీజేపీ అభ్యర్థి శివన్న గౌడ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. బీహార్ లోని హర్ లాఖీ నియోజకవర్గంలో ఆర్ఎస్ఎల్పీ అభ్యర్థి సుధాంషు శేఖర్ 7,300 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పంజాబ్ లోని ఖదూర్ సాహెబ్ ఉపఎన్నికల్లో శిరోమణి అకాలీ దళ్ అభ్యర్థి రవీందర్ సింగ్ 22,128 ఓట్ల అధికంతో గెలుపును దాదాపు ఖాయం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News