: రాజమహేంద్రవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం


తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశమయింది. బీజేపీ ఎంపీ, రాష్ట్రశాఖ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, మంత్రి మాణిక్యాలరావు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అందించాల్సిన సాయం, వివిధ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యాచరణ తదితర అంశాలపై చర్చించనున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ తదుపరి అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్న అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. రాజమహేంద్రవరంలో మార్చి 6న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో సభకు చేయాల్సిన ఏర్పాట్లపైనా చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News