: ఓయూలో మళ్లీ టెన్షన్!... ఏబీవీపీ ఫ్లాగ్ మార్చ్, వర్సిటీ గేట్లను మూసేసిన పోలీసులు


తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు నెలవైన హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ)లో మరోమారు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీలో నెలకొన్న తాజా పరిస్థితులకు నిరసనగా ఏబీవీపీ విద్యార్థి సంఘం ఓయూలో ఫ్లాగ్ మార్చ్ కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటాయోనన్న అనుమానంతో భారీ ఎత్తున పోలీసులు అక్కడ మోహరించారు. ప్రస్తుతం వర్సిటీలోకి ఎలాంటి వాహనాలను అనుమతించని పోలీసులు, రెండు వైపులా గేట్లను మూసేశారు. దీంతో అక్కడ ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News