: ముస్తాక్ కుటుంబానికి రూ.25 లక్షలు అందజేసిన మంత్రి కేఈ


సియాచిన్ మంచుతుపానులో అమరుడైన వీరసైనికుడు ముస్తాక్ అహ్మద్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ.25 లక్షలను డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కర్నూలు జిల్లా కలెక్టర్ కు అందజేశారు. దాంతోపాటు ప్రభుత్వం తరపున ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ముస్తాక్ భౌతికకాయానికి కేఈ, కలెక్టర్ నివాళులర్పించారు. మరికాసేపట్లో కర్నూలు జిల్లాలోని స్వస్థలం పార్నెపాలెం గ్రామంలో ముస్తాక్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఆ తరువాత సైనిక వందనం సమర్పిస్తారు. చివరగా ముస్లిం సంప్రదాయంలో అంతిమ సంస్కారాలు జరుగుతాయి. మరోవైపు ముస్తాక్ ను కడసారి చూసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు.

  • Loading...

More Telugu News