: ఇక ఆప్ నేత వంతు!... ఉగ్రవాదులకు పట్టిన గతేనని బెదిరింపులు


ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న వివాదం రాజకీయ నేతల మెడకు చుట్టుకుంది. అప్పటిదాకా ఢిల్లీలో నిశ్చింతగా నిద్రపోయిన పలువురు నేతలకు ప్రస్తుతం కంటి మీద కునుకు పడటం లేదు. జేఎన్ యూ వివాదంపై స్పందించిన కారణంగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. ఇక సీపీఎం పార్టీ కార్యాలయంపై రాళ్ల వర్షం కూడా కురిసింది. ఈ నేపథ్యంలో ఏచూరికి భద్రతను పెంచిన ప్రభుత్వం, సీపీఎం కార్యాలయం వద్ద భారీగా బలగాలను మోహరించింది. తాజాగా ఢిల్లీలో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అశుతోశ్ కు కూడా బెదిరింపులు వచ్చాయి. జేఎన్ యూ వివాదంపై స్పందించిన కారణంగా కేవలం 24 గంటల వ్యవధిలో ఆయనకు రెండుసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తనను కూడా మట్టుబెడతామని ఫోన్ చేసిన వ్యక్తులు బెదిరించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో తనకు ఎదురైన వేధింపులను పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News