: చంద్రబాబు ఒప్పుకున్నారు, ఆ గ్రామాలు మనకే: కేసీఆర్


ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తెలంగాణ నుంచి విడిపోయి ఏపీలో కలిసిపోయిన నాలుగైదు గ్రామాలు తిరిగి తెలంగాణలో కలవనున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఈ విషయమై తాను ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడానని, ఆ గ్రామాలను వెనక్కు ఇచ్చేందుకు ఆయన ఒప్పుకున్నారని తెలిపారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, అతి త్వరలో గ్రామాలన్నీ తిరిగి తెలంగాణలో కలుస్తాయని, అక్కడి వారికి కావాల్సిన అన్ని రకాల సాయం చేసేందుకు తన ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఖమ్మం జిల్లాను రెండుగా చేసేందుకు కట్టుబడి ఉన్నానని అన్నారు. జిల్లాలో మైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News