: న్యూయార్క్ బయలుదేరిన విమానంపై లేజర్ దాడి!


అది వర్జిన్ అట్లాంటిక్ కు చెందిన విమానం. లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి యూఎస్ లోని న్యూయార్క్ కు బయటలుదేరింది. మొత్తం 252 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బందితో విమానం టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే లేజర్ దాడికి గురయ్యింది. ఈ కిరణాలు పైలట్ కళ్లకు తాకడంతో ఆయన అస్వస్థతకు లోనయ్యాడు. ఇక విమానాన్ని ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని భావించి, విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు తెలిపాడు. తిరిగి హీత్రూలోనే క్షేమంగా ల్యాండింగ్ చేశాడు. ఈ కిరణాలు ఎక్కడి నుంచీ వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, లండన్ పరిధిలో గత ఐదేళ్ల వ్యవధిలో దాదాపు 1300 సార్లు విమానాలపై లేజర్ దాడులు జరిగాయి.

  • Loading...

More Telugu News