: నాడు అండగా ఉండి... నేడు అడ్డుకుంటారా?: పీడీఎస్ యూ నేతలకు షాకిచ్చిన కేసీఆర్


ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా నిన్న గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు విద్యార్థి సంఘం పీడీఎస్ యూ నేతలకు షాకిచ్చారు. వివరాల్లోకెళితే...నిన్న ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లిన కేసీఆర్ ను నాగార్జున సాగర్ ప్రాజెక్టు (ఎన్నెస్పీ) గెస్ట్ హౌస్ వద్ద పీడీఎస్ యూ నేతలు అడ్డుకునే యత్నం చేశారు. విద్యారంగ సమస్యలు తీర్చాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. విద్యార్థి సంఘం నేతల నినాదాలను వింటూనే గెస్ట్ హౌస్ లోపలికి వెళ్లిపోయిన కేసీఆర్, ఆ తర్వాత వారిని తన గదికి పిలిపించుకున్నారు. ‘‘నాడు తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఖమ్మంలో దీక్ష చేసినప్పుడు తెలంగాణ కోసం నా పోరాటానికి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు నన్నే అడ్డుకుంటారా?’’ అని ఆయన వారిని నిలదీశారట. దీంతో షాక్ తిన్న పీడీఎస్ యూ నేతలు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసమే అడ్డుకునే యత్నం చేశామని చెప్పారట. దీంతో అక్కడికక్కడే స్పందించిన కేసీఆర్... సదరు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పి వారిని పంపేశారు.

  • Loading...

More Telugu News