: టీడీపీలోకి ‘ఆది’ చేరికకు సర్వం సిద్ధం... రామసుబ్బారెడ్డిని స్వయంగా ఒప్పించిన చంద్రబాబు


తెలంగాణలో జోరందుకున్న అధికార పార్టీలోకి చేరికలు... ఇక ఏపీలోనూ మొదలుకానున్నాయి. తెలంగాణలో పార్టీ నేతలను కాపాడుకోలేక నానా తంటాలు పడుతున్న టీడీపీకి, ఏపీలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. పార్టీలోకి చేరతామంటూ విపక్ష పార్టీలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారట. ఈ క్రమంలో సుదీర్ఘకాలంగా టీడీపీలో చేరతారంటూ ప్రచారంలో ఉన్న వైసీపీ నేత, కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు టీడీపీ ఇన్ చార్జీ, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి... ఆదినారాయణరెడ్డి చేరికను మొదటి నుంచి అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో నిన్న చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో రామసుబ్బారెడ్డి హుటాహుటిన విజయవాడ వెళ్లారు. విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సొంత జిల్లా కడపలో పార్టీ బలహీనంగా ఉందని, ఈ నేపథ్యంలో కొంతమంది నేతలను చేర్చుకోక తప్పదని చంద్రబాబు... రామసుబ్బారెడ్డికి చెప్పినట్లు సమాచారం. త్వరలోనే నియోజకవర్గాల సంఖ్య పెరగనుందని, మీ గౌరవానికి ఇబ్బంది రాకుండా వ్యవహరిస్తామని చంద్రబాబు చెప్పడంతో, ఆయన మాటలకు రామసుబ్బారెడ్డి కేవలం తలూపారని సమాచారం. తర్వాత కుటుంబ సభ్యులు, అనుచరవర్గంతో చర్చించి నిర్ణయం చెబుతానని ఆయన చంద్రబాబుకు చెప్పారని తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీలోకి ఆది చేరిక దాదాపు ఖాయమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News