: సౌతాఫ్రికా విమానంలో మిలియన్ల కొద్దీ డబ్బు...ఓ శవం!


ఓ విమానంలో మిలియన్ల కొద్దీ డబ్బు, దానితో పాటు ఓ శవాన్ని విమానాశ్రయాధికారులు గుర్తించారు. ఫ్లోరిడాకు చెందిన వెస్ట్రన్ గ్లోబెల్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం జర్మనీ నుంచి సౌతాఫ్రికా వెళ్తుండగా, ఇంధనం నిండుకోవడంతో జింబాబ్వేలోని ఓ విమానాశ్రయంలో దిగింది. దీనికి ఇంధనం నింపే క్రమంలో ఆ విమానాశ్రయాధికారులు అందులో రక్తాన్ని గుర్తించి అప్రమత్తమయ్యారు. దీంతో విమానంలో తనిఖీలు నిర్వహించారు. అందులో మిలియన్ల కొద్దీ సౌతాఫ్రికా రిజర్వ్ బ్యాంకుకు చెందిన డబ్బు, ఓ శవాన్ని గుర్తించారు. దీంతో, పైలట్ డేవిడ్ చవోటను ప్రశ్నించారు. ఆ డబ్బు సౌతాఫ్రికా రిజర్వ్ బ్యాంకుదని చెప్పడంతో, దానిని వేరే మార్గంలో సౌతాఫ్రికాకు తరలించారు. సదరు పైలెట్ ను అదుపులోకి తీసుకుని శవం విషయమై విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News