: స్విట్జర్లాండ్ లో చార్లీ చాప్లిన్ మ్యూజియం


నవ్వుల రారాజు చార్లీ చాప్లిన్ మ్యూజియం త్వరలో ప్రారంభం కానుంది. చాప్లిన్ 127వ జయంతిని పురస్కరించుకుని వచ్చే ఏప్రిల్ 17వ తేదీన స్విట్జర్లాండ్ లో ఈ మ్యూజియంను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మ్యూజియంలో చార్లిన్ ఉపయోగించిన వస్తువులతో పాటు ఆయన జీవిత విశేషాలను తెలియజేసే చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు. మ్యూజియం నిర్మాణపు పనులు సుమారు 15 ఏళ్ల పాటు కొనసాగాయి. కాగా, బ్రిటన్ లో జన్మించిన చార్లీ చాప్లిన్ కామిక్ యాక్టర్ గా ఎంత ప్రజాదరణ పొందాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాస్య నటుడిగానే కాకుండా డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్ మొదలైన విభాగాల్లో తానేంటో నిరూపించుకున్న చాప్లిన్ జీవితంలో చివరి 25 సంవత్సరాలు స్విట్జర్లాండ్ లోనే గడిపాడు.

  • Loading...

More Telugu News