: 'రైనాను నియంత్రించడం మాకు తెలుసు' అంటూనే అతనిని ప్రశంసించిన ధోనీ!


టీమిండియాలో కెప్టెన్ ధోనీ, సురేష్ రైనా, రవీంద్ర జడేజా మధ్య విడదీయరాని అనుబంధం ఉందని వీరి గురించి అవగాహన ఉన్న ఎవరికైనా తెలుసు. చెన్నై సూపర్ కింగ్స్ పై నిషేధం విధించడంతో వీరి బంధం బద్దలైంది. వీరు ముగ్గురూ మూడు జట్లకు ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 'రైజింగ్ పూణే సూపర్ జైంట్స్' జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ, మానసికంగా చెన్నై జట్టుతో విడదీయరాని బంధం ఉందని అన్నాడు. అయితే చెన్నైని నిషేధించడంతో పూణే జట్టులోకి తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. కెప్టెన్ గా తనపై పూణే యాజమాన్యం పెద్ద బాధ్యత పెట్టిందని ధోనీ చెప్పాడు. ఐపీఎల్ లో ఇప్పటి వరకు తనతో కలిసి ఆడిన రైనా, జడేజా, మెక్ కల్లమ్ వేర్వేరు జట్లకు వెళ్లిపోవడం లోటేనని ధోనీ తెలిపాడు. ధోనీని మైదానంలో ఎదుర్కోవడం కష్టమన్న రైనా వ్యాఖ్యలపై మాట్లాడుతూ, గుజరాత్ లయన్స్ కెప్టెన్ గా రైనా ఆడుతున్నాడని, అతనిని నియంత్రించడం తమకు తెలుసని ధోనీ అన్నాడు. అయితే మైదానంలో రైనా వందకు వంద శాతం కష్టపడతాడని ధోనీ కితాబు ఇచ్చాడు.

  • Loading...

More Telugu News