: 'మేక్ ఇన్ ఇండియా' వారోత్సవాలకు పాక్ వ్యాపారవేత్తలు!
ముంబయిలో జరుగుతున్న మేక్ ఇన్ ఇండియా వారోత్సవాల్లో పాకిస్థాన్ కు చెందిన 150 మంది వ్యాపారవేత్తలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాక్ వ్యాపారులతో అక్కడి భారత హై కమిషనర్ గౌతమ్ భంబావాలే సమావేశమై పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఈ నెల 13న ప్రారంభమైన ఈ వారోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత ప్రభుత్వం ఈ 'మేక్ ఇన్ ఇండియా' వారోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.