: బస్సు నడుపుతుండగా డ్రైవర్ మృతి... చెట్టును ఢీకొట్టిన బస్సు!


బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని కోల్హాపూర్ జిల్లాలో ఈరోజు జరిగింది. మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు నవ్లీ గ్రామం మీదుగా వెళుతుండగా డ్రైవర్ బాబురావ్ సావంత్ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అదుపు తప్పిన బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ సంఘటనలో సుమారు 22 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News