: మేడారం జాతరకు 4 వేల ప్రత్యేక బస్సులు


మేడారం జాతరకు నాలుగు వేల ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ జేఎండీ రమణారావు తెలిపారు. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ మెయిన్ సెంటర్ నుంచి బయలుదేరే ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉందన్నారు. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీ వసూలు చేస్తామని, ప్రత్యేక ఏర్పాట్ల నిమిత్తం రూ.1.92 కోట్లు కేటాయించామని అన్నారు. జాతర ముగిసే వరకు హైదరాబాద్ నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు నడుపుతామని రమణారావు చెప్పారు.

  • Loading...

More Telugu News