: 50 శాతం దేశీయ ఐటీ ఉద్యోగుల్లో అసంతృప్తి!: మాన్ స్టర్ శాలరీ ఇండెక్స్


దేశంలో ఐటీ రంగంలోని ఉద్యోగుల వేతనాల విధానంపై మాన్ స్టర్ శాలరీ ఇండెక్స్ (ఎంఎస్ఐ) ఓ నివేదిక రూపొందించింది. అత్యధిక జీతాలు అందుకుంటున్న వారిలో మొదటిస్థానంలో ఐటీ ఉద్యోగులే ఉన్నా... వారిలో సగంమంది అసంతృప్తిగానే ఉన్నట్టు వెల్లడించింది. ఐటీ రంగ ఉద్యోగులు గంటకు సగటున రూ.346.42 అందుకుంటున్నారని, తయారీ రంగంలోని ఉద్యోగులు కనిష్టంగా సగటున రూ.254.04 తీసుకుంటున్నారని మాన్ స్టర్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ మోదీ తెలిపారు. అయితే దేశంలో అత్యధికంగా వేతనాలు చెల్లించే రంగం ఐటీ అయినా ఈ రంగంలోని 57.4 శాతం మంది ఉద్యోగులు మాత్రమే సంతృప్తిగా ఉన్నారని నివేదికలో పేర్కొంది. ఐటీ రంగం తరువాత బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగం గంటకు సగటున అత్యధికంగా రూ.300.23 చెల్లిస్తూ రెండో స్థానంలో నిలిచింది. భారత్ లో ఈ రెండు రంగాలే అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నాయి. ఈ రెండు రంగాల్లోని ఉద్యోగుల్లో దాదాపు 50 శాతం మందే తమ వేతనాలతో సంతృప్తిగా ఉంటున్నట్టు పేర్కొంది. అయితే మేకిన్ ఇండియా నినాదంతో ఈ రంగంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినా ఉద్యోగులకు ఇంకా అవే జీతాలు అందుతున్నాయని, మాస్టర్ డిగ్రీ కలిగి ఉన్న ఉద్యోగి కూడా సగటున రూ.260.8 అందుకుంటున్నాడని వివరించింది. మరో విషయమేంటంటే, ఐటీ రంగంలోని దేశీయ కంపెనీలు చెల్లిస్తున్న దానికంటే విదేశీ కంపెనీలు ఉద్యోగులకు డబుల్ వేతనాలు ఇస్తున్నట్టు తెలిపింది. ఇదిలాఉంటే, ఉద్యోగుల అసంతృప్తికి గల కారణాలను మాన్ స్టర్ వివరించకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News