: జేఎన్ యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడి వ్యవహారానికి సంబంధించి ఆధారాలున్నాయి: ఢిల్లీ పోలీస్ కమిషనర్


ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా, జాతికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన జేఎన్ యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ వ్యవహారంపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ స్పందించారు. అతను జాతి వ్యతిరేక నినాదాలు చేశారనేందుకు తమ వద్ద కచ్చితమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. అదే సమయంలో అతను జాతివ్యతిరేక ప్రసంగం కూడా చేశాడని తెలిపారు. ప్రస్తుతం అతనిపై విచారణ కొనసాగుతోందని, ఆ తరువాతే అన్ని విషయాలను వెల్లడిస్తామని అన్నారు. మరోవైపు కన్నయ్యపై దాఖలైన దేశద్రోహం కేసును ఎన్ఐఏకు అప్పగించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రేపు ఈ పిటిషన్ విచారణకు రానుంది.

  • Loading...

More Telugu News