: పాటియాలా హౌస్ కోర్టులో విద్యార్థులు, టీచర్లపై లాయర్ల దాడి


ఢిల్లీలోని పాటియాలా కోర్టు ఆవరణ రణరంగంగా మారింది. జేఎన్ యూ విద్యార్థులు, టీచర్లపై లాయర్లు భౌతిక దాడులకు పాల్పడ్డారు. జేఎన్ యూ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను ఈరోజు కోర్టుకు హాజరుపరచడానికి కొద్ది నిమిషాలకు ముందే ఈ సంఘటన చోటుచేసుకుంది. కోర్టు ప్రాంగణానికి చేరుకున్న ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్ కార్యకర్తల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. దాంతో అక్కడికి చేరుకున్న కొంతమంది న్యాయవాదులు కూడా ఏబీవీపీ కార్యకర్తలతో కలిసి ఈ దాడులకు పాల్పడ్డారు. ఈ సంఘటనను చిత్రీకరిస్తున్న వీడియో జర్నలిస్టులను కూడా వారు వదల్లేదు. వారి చేతుల్లోని మొబైల్ ఫోన్స్ లాక్కుని మరీ పగులగొట్టారు. దేశానికి వ్యతిరేకంగా ర్యాలీలు ఎలా నిర్వహిస్తారంటూ వారు మండిపడ్డారు. కాగా, బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ కూడా గుర్తుతెలియని ఒక వ్యక్తిపై చేయి చేసుకున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News