: రోజా సస్పెన్షన్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా


వైసీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా సస్పెన్షన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. గతేడాది శాసనసభ సమావేశాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏడాదిపాటు ఆమెను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. దానిపై రోజా హైకోర్టును ఆశ్రయించారు. మరికొన్ని రోజుల్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు జరగనుండగా హైకోర్టు ఈ అంశంపై ఎలా స్పందిస్తుందోనని ఏపీ ప్రభుత్వం, ఇటు ప్రతిపక్ష వైసీపీ ఎదురుచూస్తున్నాయి. మరోవైపు రోజా మాత్రం తనకు న్యాయం జరుగుతుందనే ఆశిస్తున్నానన్నారు.

  • Loading...

More Telugu News